ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “పుష్ప 2” మూవీ నేడు దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ థియేటర్లలో సందడి చేస్తుంది. కొన్ని ఏరియాల్లో డిసెంబర్ 4 రాత్రి నుంచే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. కొన్ని చోట్ల ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి ‘పుష్ప 2 ది రూల్’ షోలు మొదలయ్యాయి. బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. మూవీ లవర్స్ అందరూ పుష్ప 2 మూవీని చూడటానికి వెళ్తున్నారు. పుష్ప 2 మూవీ ఇప్పటికే నెట్టింట ట్రెండ్ అవుతోంది. సినిమా చూసిన బన్నీ ఫ్యాన్స్, నెటిజన్లు వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
పుష్ప ఫస్ట్ హాఫ్‌లో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ విరగదీశాడని, సుక్కు టేకింగ్, మేకింగ్ నెక్ట్స్ లెవెల్ అని పొగిడేస్తున్నారు. ఇక పీలింగ్స్ పాటలో శ్రీవల్లి, బన్నీ స్డెప్పులు సినిమాకే హైలెట్ అయ్యాయని అంటున్నారు. ఇంటర్వెల్ సీన్‌కు పుష్ప, షెకావత్ డైలాగ్స్ సూపర్ అని అంటున్నారు. సెకండాఫ్ చూసి బయటకొచ్చి బ్లాక్ బస్టర్ అంటూ విజిల్స్ వేస్తూ చెబుతున్నారు. ఎమోషనల్ సీన్లు చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెబుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్స్ గూస్ బంప్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.