శ్రీహరికోటలో PSLV-C55 మొదటి దశ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ కు చెందిన 741కిలోల టిలియోస్-2తో పాటు 16 కిలోల లూమిలైట్-4 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు శాస్త్రవేత్తలు. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఇప్పటివరకు 424 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 11.49గంటలకు ప్రారంభమై.. ఇవాళ మధ్యాహ్నం 2.19గంటలకు పూర్తి అయింది. మొత్తం 25గంటల 30నిమిషాల కౌంట్ డౌన్ ముగియడంతో PSLV-C55 ఉప్రగహం నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటికే ప్రయోగం విజయవతం కావాలని ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.