సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు ప్రధాని పర్యటిస్తారు. సాయంత్రం నారాయణపేట లో నిర్వహించే సభకు హాజరౌతారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా పై ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉందని బిజెపి శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయగా సభా ప్రాంతాన్నిమహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పరిశీలించారు.