Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఎన్నికల ప్రచారానికి చివరి ఘడియలు

   మైకులు మూగబోయే సమయం ఆసన్నమైంది. ఈ నెల 13న పోలింగ్‌ జరగనుండటంతో ప్రచార పర్వానికి తెరపడనుం ది. దీంతో ఉన్న ఈ కాస్త సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ఖమ్మం జిల్లా అభ్యర్థులు. ప్రచారం చివరి దశలో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంలో ఉన్నారు.

   లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి గడువు ఆసన్నమైంది. ఈ నెల 13న ఎన్నికలు జరగనుండటంతో ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రచారం పర్వం ముగియనుంది. ఆ తర్వాత మైకులు మూగబోనున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ నేతల సందడి, ప్రచార కోలాహాంతో కిటకిటలాడిన వాడలన్నీ వెలవెల బోనున్నాయి. ఇక ప్రచారానికి అతి తక్కువ సమయమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు అభ్యర్థులు. ఇందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించు కుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ముఖ్య నేతల తో ప్రచారాన్ని హోరెత్తించారు. భారీ బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌ షోలతో ఓ రేంజ్‌లో ప్రచారం సాగగా మరి కొందరు నేతలను రప్పించడంపై ఫోకస్‌ పెట్టారు.

  ఖమ్మం లోక్‌సభ బరిలో 35 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. గత నెల 18 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా ఈ నెల 13న పోలింగ్‌ జరగనుంది. అయితే నామినేషన్లకు ముందే బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్ధులుగా నామ నాగేశ్వరరావు, తాండ్ర వినోద్‌రావును ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్ధిగా రామసహాయం రఘురామరెడ్డిని బరి లోకి దింపింది కాంగ్రెస్‌. అయితే, ఎలాంటి ఆర్బాటం లేకుండానే నామినేషన్లు వేసిన అభ్యర్ధులు ప్రచారాన్ని మాత్రం హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి ప్రకటన ఆలస్యం కావడంతో తొలుత ఎన్నికల జోష్ కనపడలేదు. రఘురామ రెడ్డిని ప్రకటించిన తరువాత కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారాన్ని కదం తొక్కించాయి. పోటాపోటీగా నియోజక వర్గ, పార్లమెంట్‌ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా పల్లెలు, పట్టణాల్లో ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.

   ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ప్రచార స్టైల్ మార్చారు. ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమైన రాజకీయ పార్టీలు ఇన్నాళ్లు రోడ్డుషోలు, సభలకే పరిమితం కాగా ప్రస్తుతం ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఖమ్మం కార్పోరేషన్‌, మధిర, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటి ప్రచారాన్ని సాగిస్తున్నారు. కరపత్రాలు, పోస్టర్లు ఇస్తూ తమ అభ్యర్ధికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. బూత్‌ కమిటీలు ఈ ప్రచారాన్ని కీలకంగా తీసుకున్నాయి. ప్రచార గడువు ముగిసే వరకు ఈ ప్రక్రియ కొనసాగేలా ప్రణాళిక రూపొం దించారు.

   హంగూ ఆర్బాటాలతో ప్రచారాన్ని హోరెత్తించినా, పోల్‌ మేనేజ్‌మెంట్‌ చెయ్యకపోతే చివరకు విజయావకాశాలు సన్న గిల్లుతాయని భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. దీంతో కోలాహలంగా ప్రచారం చేయిస్తున్న అభ్యర్ధులు మరోవైపు పోల్‌ మేనేజ్‌మెంట్‌పైనా దృష్టి సారించారు. గత రెండు, మూడు ఎన్నికల్లో తమ పార్టీకి పోల్‌ అయిన ఓట్లు ఎన్ని, ఎక్కడ తగ్గాయన్నది బేరీజు వేసుకుంటూ ఆ ప్రాంతం ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. పార్టీల వారీ ఓట్లతోపాటు కులాల వారీగా ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కలు తీస్తున్నారు. వీటి ఆధారంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు అగ్రనేతల ప్రచారాలు చూసుకుంటే, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు తరపున కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారానికి వచ్చారు. అలాగే బస్తర్‌ రాజు రమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌ సైతం ఖమ్మంలో ప్రచారానికి హాజయ్యారు. ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోసం మాజీ సీఎం కేసీఅర్‌ ఖమ్మం, కొత్తగూడెంలో రోడ్డుషో నిర్వహించారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు పార్ల మెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశమై దిశానిర్ధేశం చేశారు. ఇంకా ప్రచారానికి కాస్త సమయం మిగిలి ఉండటంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం ప్రచారానికి హాజరవుతారని సమాచారం. మరోపక్క కాంగ్రెస్‌ అభ్యర్ధి రఘురాంరెడ్డికి మద్దతుగా సీనీ హీరో వెంకటేష్‌ ఖమ్మం, కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారాన్ని హోరేత్తి స్తున్నారు. కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నేతలను రప్పించి పోటాపోటీగా ప్రచారం చేస్తున్మారు. ఇలా అన్ని పార్టీల ముఖ్య నేతల ప్రచారంతో ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో ప్రసంగాల మోత మోగుతోంది. మరి హోరాహోరీగా సాతున్న ఈ త్రిముఖ పోరులో ఖమ్మం ప్రజలు ఎవరి హామీలను నమ్ముతారు..? ఎవరిని ఎంపీ సీటు వరించబోతోంది. అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్