21.7 C
Hyderabad
Monday, February 23, 2026
spot_img

ఈ నెల 21 నుంచి అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. మూడ్రోజుల పాటు అగ్రరాజ్యంలో మోదీ పర్యటన సాగనుంది. విల్మింగ్టన్ లో జరిగే 4వ క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ప్రధాని హాజరుకానున్నారు. సెప్టెంబరు 21న జరిగే క్వాడ్ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమివ్వనున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల అభివృద్ధి లక్ష్యాలకు, ఆకాంక్షలకు తోడ్పాటు అందించడంపై ఈ క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు.

అమెరికాలో జరిగే తాజా క్వాడ్ సమావేశంలో, బైడెన్ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే సమయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు కూడా వీడ్కోలు పలకనున్నారు. క్వాడ్ దేశాల గ్రూప్ లో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. క్వాడ్ సదస్సు అనంతరం, ప్రధాని మోదీ ఈ నెల 23న న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. మరోవైపు వచ్చే ఏడాది క్వాడ్ దేశాల సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ అంగీకరించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్