స్వతంత్ర, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ అరియర్ల కింద 16 వాయిదాల్లో 7,382 కోట్లను చెల్లిస్తుందని ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. క్రమబద్దీకరణ చేయాల్సిన ఉద్యోగుల సంఖ్య దాదాపుగా 10 వేల మంది వరకూ ఉంటుందని తెలిపారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అనేది ఉండదన్నారు. ఓపీఎస్ తో సమానమైన అంశాలతోనే పెన్షన్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగ సంఘాలు కేబినెట్ లో తీసుకునే నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేస్తాయని.. ఇక ముందు ఉద్యోగ సంఘాల ఆందోళనలు కూడా ఉండవని భావిస్తున్నానని తెలిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని ఉద్యోగ సంఘాలు సంతృప్తిని వ్యక్తం చేశాయని తెలిపారు.


