దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావించారని ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్(Prakash Ambedkar) తెలిపారు. అటువంటి హైదరాబాద్ లో 125అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్(CM KCR) కు అభినందనలు అన్నారు. అంబేద్కర్ ఆశయాలు కేవలం దళితులు, ఆదివాసీలు కోసమే కాదని.. ప్రజలందరి కోసమన్నారు. దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అంబేద్కర్(Ambedkar) కోరుకున్నారని.. ఇప్పుడు ఆయన ఆశయాలను కేసీఆర్ కొనసాగిస్తున్నారని కొనియాడారు.
అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారని.. ఆయన ప్రాణత్యాగం చేస్తే కానీ ప్రత్యేక రాష్ట్రం రాలేదన్నారు. చిన్న చిన్న రాష్ట్రాలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని.. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందన్నారు ప్రకాశ్(Prakash Ambedkar).
Read Also: అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
Follow us on: Youtube, Koo, Google News