మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు రౌడీషీట్ తెరిచినట్టు సమాచారం. ప్రధానంగా 4 కేసులలో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ పై తాజాగా రౌడీషీట్ తెరవాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించా రు. ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా వైసీపీ అభ్యర్థి అయిన పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి ఈవీఎంలను పగలగొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై అనుచరులతో దాడిచేయిం చారు. ఈ ఘటనకు సంబంధించి ఆయనపై కేసులు నమోదు కాగా, ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. తాజాగా, పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్ తెరిచినట్టు తెలుస్తోంది.