ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఈడీ మరోసారి నోటీసులు పంపింది. మార్చ్ 10 వ తేదీన ఢిల్లీ లోని ఈడీ ఆఫీస్ కు విచారణకు హాజరవ్వాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చారు. మంగళవారం రామచంద్ర పిళ్ళై ని అరెస్ట్ చేసిన అధికారులు.. కవితను మరోసారి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో బంజారాహిల్స్ లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆమె ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఎవరినీ అటువైపు వెళ్ళడానికి అనుమతించడం లేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.