స్వతంత్ర వెబ్ డెస్క్: యువతే టార్గెట్ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ రాందాస్ పోలీసులకు చిక్కాడు. అతనిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో 9 రాష్ట్రాల్లో డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న.. స్మగ్లర్ రాందాస్ ను ఎట్టకేలకు పట్టుకోగలిగారు. స్మగ్లర్ రామ్ దాస్ అరెస్ట్ పై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మీడియాతో మాట్లాడారు. గత 3 నెలలుగా గంజాయి, డ్రగ్స్ సరఫరాపై నిరంతరం నిఘా పెట్టామని తెలిపారు. స్మగ్లర్ రామ్ దాస్ 9 రాష్ట్రాలలో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
రాందాస్ డ్రగ్స్ గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుండగా.. ఒరిస్సా రాష్ట్రంలోని చాటువా గ్రామంలో పట్టుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. రామ్ దాస్ కి దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉందని.. పలు రాష్ట్రాల్లో వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎస్పీ జాషువా తెలిపారు. అంతేకాకుండా అతనిపై పెనమాలూరులో 3 కేసులు ఉన్నాయని.. ఇప్పుడు పీడీ యాక్ట్ కేసు పెడుతామన్నట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా మరో స్మగ్లర్ బందరుకు చెందిన బలగం నాగరాజు మచిలీపట్నం, పెడన ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సఫ్లై చేస్తున్న మంచాల కిరణ్ రాజును గుడివాడలో అదుపులోతీసుకోగా.. ఘంటసాలలో మరొకరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జాషువా తెలిపారు.