Viral News | ఎవరినైనా హత్య చేస్తే.. అది హత్యా నేరం అవుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరుస్తారు. అదే జంతువులు, పక్షుల కారణంగా గాయాలైనా.. ప్రాణాలు పోయినా ఎవరిపై కేసులు పెడతారు. అయ్యో పాపం అని బాధపడటం తప్పా.. కాని కోడి కారణంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వెలగటూరు మండలం కొండపూర్‌కు చెందిన సత్తయ్య మూడు రోజుల క్రితం పందేం కోడి కాలుకు కత్తి కత్తాడు. ఆ కత్తి పొరపాటున సత్తయ్య పొట్టలో గుచ్చుకుని మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సత్తయ్య మృతికి కోడి కారణమని తేల్చారు. ఇంకేముంది.. ఆకోడిని వెతికి పట్టుకుని దానిపై హత్యా నేరం కేసు మోపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఎ1 నిందితురాలిగా కోడిని చేర్చారు. కోడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కోడి కూతలతో పోలీస్ స్టేషన్ హోరెత్తింది.
Viral News |వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం.. గతంలోనూ కోడి పందేల సమయంలో కోళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఘటనలు తెలిసిందే. అయితే ఓ కోడిపై హత్యా నేరం కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. కోడిని కోర్టులో హజరుపరిస్తే.. దానికి ఏమి శిక్ష వేస్తారు.. న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.