దేశంలో మొత్తం ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా? దశాద్దన్నర కాలంలో దాదాపు పులు సంఖ్య రెట్టింపు అయింది. ప్రాజెక్ట్ టైగర్ 50 సంత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో పులుల సంఖ్య డేటాను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా 2019 నుంచి ఇప్పటివరకు పులుల సంఖ్య 200 పెరిగినట్లు చెప్పారు.
తాజా గణాంకాల ప్రకారం 2018లో 2,967 పులులు ఉండగా.. 2022 నాటికి ఆ సంఖ్య 3,167కు పెరిగింది. 2006లో 1,411, 2010లో 1,706, 2014లో 2,226 పులులు ఉన్నాయి. కాగా దక్షిణాది పర్యటనలో ఉన్న మోదీ కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్, తమిళనాడులోని ముదులై టైగర్ రిజర్వ్ కేంద్రాలను సందర్శించారు. అడవిలో కాలక్షేపంగా గడిపిన ఫోటోలను మోదీ ట్విట్ చేశారు.