ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో మూడు రోజులపాటు ధ్యానంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లోక్ సభ ఎన్నికల చివరదశ ప్రచారం ముగింపు వేళ ఈనెల 30 న ప్రధాని తమిళనాడు కు వస్తారు. ఢిల్లీ నుంచి తిరువనంత పురం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కన్యాకుమారికి చేరుకుంటారు. కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద శిలా స్మారకం వద్ద ముడు రోజులపాటు ధ్యానం చేయనున్నారు. కన్యాకమారి నుంచి శిలా స్మారకానికి పదవలో చేరుకుని 30న సాయం్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకూ ధ్యానం కొనసాగుతుంది. 2019 లో కూడా ఎన్నికల ప్రచారం ముగియగానే కేదార్ నాథ్ గుహకు చేరుకుని ధ్యానం చేశారు.


