24.2 C
Hyderabad
Sunday, November 2, 2025
spot_img

వైసీపీ శిబిరాల్లో పీకే కలవరం

    జోస్యాలు హాస్యాలైన సందర్భాలెన్నో ఉన్నాయి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కారు పార్టీ గ్యారెంటీగా గెలుస్తుందని చెప్పిన ఉద్ధండ జ్యోతిష్య పండితులు…అనంతరం తలలు దించుకున్నారు. ఓటరు మదిలో ఏముందో ఎవరు ఏమీ చెప్పలేరు. అయితే, ఏ విషయాన్ని ఏ పార్టీ, ఏ నేత తక్కువగా అంచనే వేసి నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తే.. ఆ చర్య పరాజయానికి దారితీయవచ్చు. ఇద్దరు పీకేలు చేస్తున్న హంగామాకు వైసీపీ మరింత అప్రమత్తమై, ఎన్నికల్లో విజయం కోసం ఆలోచనలు సాగిస్తోంది.

     ఇద్దరు పీకేల వ్యాఖ్యానాలు వైసీపీని మరింత అప్రమత్తం చేసేలా ఉంటున్నాయి. ఒకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , మరొకరు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. గత ఎన్నికల్లో వైసీపీ అధికారం లోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బలంగా పనిచేసాయి. అలాంటి పీకే ఇప్పుడు వైసీపీకి ఎదురు తిరిగారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడం అంత ఈజీ కాదని ప్రశాంత కిషోర్ జోష్యం చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ మాటలను వైసిపి పైకి తేలిగ్గా తీసుకుంటున్నా …అంతర్గతంగా మరింత అప్రమత్తం అవుతోంది.

     2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అధినేత పడిన శ్రమ అంతా ఇంతా కాదనే విషయం అందరికీ తెలిసింది. తాను ఎండల్లో, ఉక్కబోతల్లో వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి, అటు విపక్షా లతో పోరాటం సల్పి, కొమ్ములు తిరిగిన పార్టీలను కొత్తగా పెట్టిన పార్టీతో ఢీకొని.. ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించా డు. మండుటెండల్లో పడిన శ్రమ అధినేతది కాగా, ఫ్యాను గాలి కింద హాయిగా సేద తీరిన ఎందరో నేతలు ఇప్పుడు ఆ యువనేత వైఖరిని తప్పు పడుతున్నారు. వంకలు వెదికి.. విమర్శలు గుప్పించి పార్టీకి దూరం అవుతున్నారు. ఇదెంత వరకు సబబని కొందరు అసలు సిసలు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదేం మాయో కాని…సీఎం జగన్ సొంత కుటుం బసభ్యులు, పార్టీ నేతల నుంచి మొదలైన ఈ వ్యతిరేకగళం ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వరకు వెళ్లిం ది. సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పక్షాన చేరి అన్నకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తు న్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, జగన్ కజిన్ సిస్టర్ సునీత రెడ్డి జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు సొంత పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ, జనసేన వైపు చూపు సారిస్తున్నట్టు తెలుస్తోంది.

     అధికారంలో ఉన్నా ఏ పార్టీ అయినా.. ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చలేదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి ఆవేశపూరిత ఉపన్యాసాలు, ఉత్సాహపూర్వక హామీలు ఇచ్చేస్తుంటారు. అవి అమలు చేసే సమయానికి బ్యాలెన్స్ షీట్ బెంబేలెత్తిస్తుంది. ఆస్తులు, అప్పులు… అన్నీ బేరీజు వేసుకుని పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ కారణంగా సాధా రణంగా అధికారంలో ఉన్న పార్టీకి కొంత ప్రతికూలం ఉంటుంది. అయితే, అంతవరకు ఎన్నో పదవు లు అనుభవించిన నేతలు, పార్టీతోను, అధిష్ఠానంతోనూ అకారణ కలహాలకు దిగి పార్టీని వీడుతు న్నారని వార్తలు వస్తున్నాయి.

     వైసీపీలో స్వపక్ష నేతలే విపక్ష నేతలుగా మారుతుండడంతో…ప్రతిపక్ష నేతలు తమ అవకాశాలు మెరుగు పర్చడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయా లని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్వప్రయత్నం సాగిస్తున్నారు. విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా టిడిపి తో ఎన్నికల పొత్తు పెట్టుకున్న పవన్, బిజెపిని సైతం తమ కుటమిలో చేరేలా ప్రయత్నాలు సాగిస్తు న్నట్టు సమాచారం. ఓవైపు పవన్ కళ్యాణ్, జగన్ని టార్గెట్ చేస్తుంటే తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దీనికి వంతపాడుతున్న విధంగా వ్యవహరిస్తున్నారు. వైసిపి ఘోర ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ అధిష్ఠానం పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. అయితే, ఆ పార్టీ వర్గాలు మాత్రం కొంత అయోమయానికి గురవుతున్నట్ట తెలుస్తోంది.

      వైసీపీకి 2016 నుంచి మూడు ఏళ్ల పాటు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలను అందించారు. వైసిపి అధికారంలోకి రావడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కారణమని వైసీపీ సైతం విశ్వసించింది. అప్పటి తెలుగుదేశ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రశాంత్ కిషోర్ తన దైన స్టైల్ లో క్యాంపెయిన్ చేశారు. అదే సమయంలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉన్న మార్గాలను అన్వేషించి వాటిని జగన్ చేత అమలు చేయించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో టిడిపి ప్రభుత్వం ఓడిపోవడం, వైసిపి అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే 2019 ఎన్నికల అనం తరం వైసీపీకి ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉంటూ వస్తున్నారు.అయితే ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడడంలో అంతరార్థం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

    ఒకప్పుడు వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రశాంత్ కిషోరే ఇప్పుడు ఈ రీతిన మాట్లాడడంతో వైసీపీ క్యాడర్ కొంత కలత చెందుతున్నట్టు తెలుస్తోంది. కేవలం పథకాలు ఇచ్చి అభివృద్ధిని పక్కన పెడితే ప్రజలు ఓటు వేసే అవకాశం ఉండదని ప్రశాంత కిషోర్ చెబుతున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ చంద్ర బాబుతో భేటీ అయ్యారని, అప్పటి నుంచి చంద్రబాబు చెప్పిన మాటల్ని ప్రశాంత్ కిషోర్ వల్లెవేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. బీహార్ లో చెల్లని ప్రశాంత్ కిషోర్ ఏపీలో ఎలా చెల్లుతారని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు వైసీపీని అయోమయానికి గురిచేశాయి. అయితే, ఈ వ్యాఖ్యల ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూహించగలరు. విధి విధానాన్ని ఎవరు తప్పించగలరు. ఓటరు మహాశయులు ఏం తీర్పు ఏ విధంగా ఉంటుందో ఎవరికి ఎరుక. లోగుట్టు పెరమాళ్ల కెరుక.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్