అమెరికాలో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. షికాగో ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొట్టుకునేంత పరిస్థితి ఏర్పడింది. రన్‌వే పైకి ల్యాండ్ అవుతున్న విమానానికి అడ్డంగా మరో విమానం వచ్చేసింది. పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ విమానాలకు ప్రమాదం తప్పింది. ఆ పెను ప్రమాదం నుంచి ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగారు. రెండు విమానాల్లో కలిపి వందమందికి పైగానే ప్రయాణికులు ఉన్నారు.
షికాగోలో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఒమాహా నుంచి షికాగో మిడ్ వే ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. రన్‌వే 30సీ మీద ల్యాండ్ అవగానికి సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయానికి, అదే రన్‌వే పైకి ఛాలెంజర్ 350 ప్రైవేటు జెట్ అడ్డంగా వచ్చింది. దీన్ని గమనించి సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అప్పటికే ల్యాండింగ్ గేర్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. విమాన చక్రాలు దాదాపు రన్‌వేను తాకబోయాయి. కానీ ఎదురుగా వస్తున్న ప్రైవేటు జెట్‌ను గమనించిన పైలెట్స్ వెంటనే ఆ విమానాన్ని పైకి లేపారు. పైలెట్ అప్రమత్తతతో ఈ రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది.
దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టింది. ఛాలెంజర్ ఛాలెంజర్ 350 ప్రైవేటు జెట్ ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక్కసారిగా రన్‌వేపైకి వచ్చేసిందని ఎఫ్‌ఏఏ వర్గాలు చెబుతున్నాయి.