స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నూతన భవనాన్ని ప్రధాని కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం జరగాలని పలు వాదనలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు న్యాయవాది జయ సుఖిన్. దీంతో ఈ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.