జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు పోతిన మహేశ్. స్వార్థ రాజకీయ ప్రయోజ నాల కోసం పవన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నిర్మాణం, క్యాడర్‌పై ఏనాడు దృష్టి పెట్టలేదన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు అన్నీ స్వార్థ పూరితమని ఫైరయ్యారు. కాపు సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నారన్న పోతిన మహేశ్.. పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని విమర్శించారు. 25 రోజుల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించారు. 21 సీట్లతో పార్టీకి ప్రజలకు ఏం భవిష్యత్ ఇవ్వగలరని నిలదీశారు పోతిన మహేశ్.
జనసేన పార్టీకి పోతిన మహేశ్ గుడ్‌బై చెప్పారు. పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పంపించారు. విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డారు పోతిన మహేశ్. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటు బీజేపీకి చెందిన సుజనా చౌదరికి కేటాయించారు. అప్పటి నుంచి పోతిన మహేశ్ నిరసన తెలుపుతూ వచ్చారు. విజయవాడ పశ్చిమ సీటు పోతిన మహేశ్‌కు కేటాయించాలని ఆయన అనుచ రులు ఆందోళనకు దిగారు. అయినా అధిష్టానం దిగిరాకపోవడంతో ఇవాళ పదవికి రాజీనామా చేశారు పోతిన మహేశ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


