స్వతంత్ర, వెబ్ డెస్క్: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14న నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో యాత్రకు సంభందించి పోస్టర్ ను రిలీజ్ చేశారు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్. కత్తిపూడి జంక్షన్ నుంచి వారాహీ యాత్రను పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గతంలో 2 వేల ఆర్జీలు ఆదికారులకు పంపామని తెలిపారు. ఈ యాత్రలో అరాచకపాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని పవన్ తెలియచేస్తారని అన్నారు.
పోలవరం జగననన్న పాపపు పథకమని వ్యాఖ్యానించిన నాదేండ్ల.. డబ్బుల కోసం పోలవరం ఎత్తు తగ్గించారని అన్నారు. 17,140 కోట్లు కేంద్రం పోలవరం ప్రాజెక్టు కు రిలీజ్ చేసింది. అలాగే పోలవరం ఎత్తుతగ్గించారని కేంద్రం కూడా స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు సీఎం హడావిడిగా పోలవరం పర్యటనకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలని నిలదీశారు. 14 వేల మంది నిర్వాసితులకు ఏ విధమైన న్యాయం చేస్తారని మండిపడ్డారు. రిటైనింగ్ వాల్ డ్యామేజికి కారణం ఏమిటి? అవినీతా, లేదా నాణ్యతా లోపమా అంటూ నిప్పులు చెరిగారు.


