స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ చేపట్టిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈనెల 30వ తేదీతో 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. రేడియో ద్వారా ప్రధాని నిర్వహించే ఈ కార్యక్రమం ప్రజలందరికీ చేరువైందని.. సామాన్యుల విజయాలను సైతం మోదీ ప్రస్తావించడం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుందని కొనియాడారు. 100కోట్ల మందికి పైగా ఈ కార్యక్రమం విన్నారని తెలిపారు. గొప్ప వ్యక్తులు, కళలు, చేతి వృత్తులు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు.. ఇలా అనేక అంశాలపై చర్చించడం ద్వారా ‘మన్ కీ బాత్’ ప్రజలకు చేరువైందన్నారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభ సందేశంలో ‘సేవా పరమో ధర్మ:’ అన్న మాటలు మనసును హత్తుకునే విధంగా ఉంటాయని చెప్పారు. 2014 అక్టోబర్ 3న విజయదశమి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడం అభినందనీయమని జనసేనాని కొనియాడారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఇలాగే భవిష్యత్ లోనూ కొనసాగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్ లో ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
JanaSena Chief Sri @PawanKalyan wishes PM Shri @narendramodi Ji on his 100th Episode of @mannkibaat which is to be aired on various radio and digital platforms on April 30th.#MannKiBaatAt100 pic.twitter.com/wSH0MO9p2B
— JanaSena Party (@JanaSenaParty) April 29, 2023