లడ్డూ వార్‌తో ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్ట్‌కు సమాధానం ఇచ్చిన పవన్.. తిరుమల లడ్డూలో జంతువుల నూనెను వాడటం విచారకరమన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వివాదంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగడం అవసరమని అభిప్రాయపడ్డారు. దేవాలయాల పవిత్రత కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు పవన్ కల్యాణ్