29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఏమ్మన్నారంటే..?

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాయి విపక్షాలు.. చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అసలు ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తుందని మండిపడ్డారు. గత యేడాది అక్టోబర్ లో విశాఖలో కూడా జనసేన పట్ల ఏ విధంగా వ్యవహరించారో అందరూ చూశారని గుర్తుచేసిన ఆయన.. ఏ తప్పూ చేయని జనసేన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారు.. నేడు చంద్రబాబును అరెస్టు చేసిన తీరును సంపూర్ణంగా జనసేన ఖండిస్తుందని ప్రకటించారు.

పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు.. ఆయన పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదు అని హితవుపలికారు పవన్‌ కల్యాణ్‌.. చిత్తూరులో కూడా ఇదే విధంగా చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరించింది.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. వైసీపీ, ప్రభుత్వం, పోలీసులు ఊరుకోమని అంటున్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా..? అధికార పార్టీకి సంబంధం ఏమిటి..? అని నిలదీశారు. నేడు ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణంగా వైసీపీ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు పవన్‌ కల్యాణ్‌.

ఒక నాయకుడు అరెస్టు అయితే.. అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి రావడం సహజం.. మీ నాయకులు అక్రమాలు చేయవచ్చు, దోపిడీలు చేయవచ్చు.. అయినా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.. కానీ, వారి నాయకులను అరెస్టు చేస్తే.. ఇంట్లో నుంచి బయటకు రానీయకూడదంటే ఎలా..? అంటూ మండిపడ్డారు పవన్‌.. లా అండ్ ఆర్డర్ కంటే కూడా.. ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నాం అన్నారు. చంద్రబాబు వీటి నుంచి బయటపడాలని జనసేన సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుందని వెల్లడించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..

Latest Articles

మా నమ్మకం నిజమైంది: ‘అష్టదిగ్బంధనం’ దర్శకుడు బాబా

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్‌ సమర్పణలో బాబా పి.ఆర్‌. దర్శకత్వంలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. సూర్య, విషిక జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150కి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్