ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామన్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కూటమి అభ్యర్థిగా జనసేనాని నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం లోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ఆయన ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ తర్వాత ప్రత్యేక కాన్వాయ్‌లో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు.మరోవైపు ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు పవన్ కళ్యాణ్. పవన్ అయిదేళ్ల సంపాదన 114.76 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు 73.92 కోట్లు కాగా.. అంద జేసిన విరాళాలు 20 కోట్లుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అప్పులు 64.26 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు.


