23.7 C
Hyderabad
Friday, October 24, 2025
spot_img

పవన్, చంద్రబాబు.. ఇద్దరూ స్టువర్ట్‌పురం దొంగలే.. మంత్రి అమర్ నాథ్ ఘాటు వ్యాఖ్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌పై(Pawan Kalyan) మంత్రి అమర్నాథ్(Minister Amarnath) మరోసారి ధ్వజమెత్తారు. విశాఖలో(Visakha) నిర్వహించిన మీడియా సమావేశంలో(Media Conference) ఆయన మాట్లాడుతూ.. పవన్ వారాహి యాత్రలో ముఖ్యమంత్రిపై విషం, విద్వేషం కనిపిస్తోందన్నారు. రుషికొండ వరకు వెళ్లిన పవన్‌కు పక్కనే గీతం సంస్థ చేసిన అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం, ప్రభుత్వ భూమినే కబ్జా చేయడం అనే విమర్శ అవగహన రాహిత్యానికి నిదర్శనమ్నారు.

యజమాని కోసం పవన్ కోతిలా గంతులు వేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు,(Chandrababu) వాళ్లకు సహకరిస్తున్న మీడియా.. అందరూ స్టువర్ట్‌పురం దొంగలని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. అటువంటి వాళ్ళు వాలెంటీర్లను దండు పాళ్యమని అవమానించడానికి నోరెలా వస్తోందని మండిపడ్డారు. పూర్తి అనుమతులతో రుషికొండ అభివృద్ధి జరుగుతుంటే.. వచ్చిన నష్టం, అభ్యంతరం ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

గట్టిగా ప్రశ్నిస్తే కేంద్రంతో చెప్పి ఆటాడిస్తానని పవన్ బెదిరిస్తున్నాడని.. కేంద్రంతో కాకపోతే పుతిన్‌తో చెప్పుకో అని మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. డాడీ, దత్తపుత్రుడు విడతల వారీగా విశాఖకు వచ్చి అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15కు పవన్ మంగళగిరి వెళితే.. చంద్రబాబు విశాఖ వస్తున్నారన్నారు. ఇద్దరు వేర్వేరుగా తిరగడం ఎందుకు.. కలిసి మెలిసి పర్యటించడం మంచిదని హితవు పలికారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్