విజయవాడ వైసీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో కార్పొరేటర్లలో ఆందోళన నెలకొనగా, వారికి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు జగన్. ఈ సమావేశానికి కార్పొరేటర్లతో పాటు మేయర్ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, పోతిన మహేష్ తదితరులు హాజరయ్యారు.