Pakistani actress dances to Naatu Naatu song | ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. సినిమాతో పాటు సినిమాలోని పాటలు జనాలను ఉర్రూతలూగించాయి. నాటు నాటు పాటకు అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. ఈ పాటలోని లిరిక్స్ కు స్టెపులు వేస్తూ తెగ రీల్స్ తెగ చేశారు సినీ ప్రియులు. తాజాగా పాకిస్తాన్ ప్రముఖ నటి హనియా ఆమిర్ కూడా ఈ పాటకు డ్యాన్స్ వేసింది. ఓ ఫంక్షన్ లో నాచో నాచో పాటకు స్టెప్పులేస్తూ అలరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా అమెరికాలో మార్చి 3వ తేదీన 200 థియేటర్లలో రీరిలీజ్ కానుంది.