రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ నినాదంతో ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నిరసనకు సంబంధించిన పోస్టర్‌ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అంబటి అన్నారు. రైతులకు కనీస మద్దతుధర దక్కడం లేదని చెప్పారు. రైతులకు 20 వేలు ఇస్తామన్నారు కానీ నయాపైసా ఇవ్వలేదని మండిపడ్డారు.