ప్రజా సమస్యలు పై వైసీపీ పోరాటం చేస్తుందని మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు నిర్ణయించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్యచరణ ప్రకటించారు అన్నారు. ఎన్నికల ముందు కూటమీ ప్రభుత్వం ఇస్తామన్న 20 వేల పెట్టుబడి సహాయం ఏమైందని ప్రశ్నించారు. రైతులు అప్పులపాలైపోయారని తెలిపారు. మద్దత్తు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. దీనిపై ఈనెల 13వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం వద్ద రైతు నిరసన కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నామన్నారు. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. కరెంటు చార్జీలు పెంచేశారన్నారు. దీంతో ఈ నెల 27 న విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమం చేస్తామని చెప్పారు.