క్రైస్తవుల సంక్షేమానికి, భద్రతకు అండగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం చేసేలా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో, అనేక వారసత్వ సమస్యలు ఉన్నాయని సీఎం అన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అన్నీ అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫాదర్స్ కి ,పాస్టర్స్ కి తాము ప్రవేశపెట్టిన గౌరవ పారితోషికాన్ని క్రిస్మస్ సందర్భంగా అందజేస్తున్నట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్ళలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. మళ్ళీ చెడు రాకుండా ఉండాలి అంటే, చెడుని గుర్తు చేసుకుంటూ ఉండాలని తెలిపారు. తమప్రభుత్వం క్రిస్టియన్లకు అండగా ఉంటుందని సీఎం చెప్పారు.