ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్. అయితే.. ఈ సందర్భంగా బహిరంగ సభల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
ఎమ్మిగనూరు సభలో ప్రచారాన్ని హోరెత్తించిన జగన్.. తాను వంద వరకు నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. అందులోనూ సామాన్యులకు టికెట్లు ఇచ్చానంటూ చెప్పుకొచ్చారు. ఈ సంద ర్భంగా అభ్యర్థుల్ని ప్రజలకు పరిచయం చేసిన జగన్.. వారిని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడే అసలు విషయం మొదలైంది. చాలా మంది ఉండగా.. ఓ టిప్పర్ డ్రైవర్‌కు శింగనమల సీటు ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది కాస్తా వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన సీఎం జగన్.. అవును తాను టిప్పర్ డ్రైవర్‌కే సీటు ఇచ్చానని, అందులో తప్పేంటని చెప్పు కొచ్చారు. పీజీ చేసిన అభ్యర్థి వీరాంజనేయులు, బీఈడీ సైతం చేశారని.. చంద్రబాబు హయాంలో ఉద్యోగం దొరక్క టిప్పర్ డ్రైవర్‌గా మారాడంటూ చెప్పుకొచ్చారు. దీంతో.. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు వ్యవహారమే కాదు.. జగన్ వ్యాఖ్యలపై కూడా విస్తృతంగా చర్చసాగు తోంది.
జగన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా విపక్షం డిఫెన్స్‌లో పడిపోయిందన్న ప్రచారం సాగుతోంది. ఓ సామా న్యుడికి టికిట్ ఇస్తే తప్పేంటన్న మాట అందరిలోనూ విన్పిస్తోంది. అయితే.. అసలు ఎన్నికల వేళ జగన్ ఇలా ఎందుకు తన అభ్యర్థులు పేదవాళ్లని అన్నారు అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యల్ని విశ్లేషిస్తే..ఓవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి ప్రభావం గట్టిగానే ఉంటుందన్న వార్తలు గత కొన్ని రోజులుగా విన్పిస్తున్నాయి. ఇలాంటి వేళ.. టికెట్ల కేటాయింపులోనే ప్రయోగాలు చేసిన జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై ఫోకస్ పెట్టారు. వారికి సింహభాగం సీట్లు కేటాయించారు. తద్వారా ఆయా వర్గాల్లో పట్టును మరింత పెంచుకునే దిశగా అడుగు వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు .. కొందరు దిగువ మధ్య తరగతి అభ్యర్థులకు సీట్లు కేటాయించడం.. ఎన్నికల ప్రచారంలో తన అభ్యర్థులు పేదవారు, సామాన్యులు అని చెప్పడం ద్వారా ప్రతిపక్షాలపై మైండ్‌గేమ్ మొదలు పెట్టారన్న వాదన విన్పి స్తోంది. పైగా ఇప్పటికే జగన్.. ప్రతి సభలోనూ రాబోయే ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య అని చెబుతుంటారు. ఇలా చెప్పడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లతో పాటు అగ్రవర్ణా ల్లోని దిగువ మధ్యతరగతి ప్రజలను తమవైపు తిప్పుకోవచ్చన్నది ఆయన వ్యూహంగా రాజకీయ విశ్లేష కులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఇదంతా జగన్ రాజకీయంలో భాగమని, మరోసారి గెలిచే ప్రయత్నంలో వేసే ఎత్తుగడలన్న అభిప్రాయం విన్పిస్తోంది. మరి వీటిపై ప్రజలు ఎలా స్పందిస్తారు ? అన్నది ఆసక్తికరంగా మారింది.