అదానీకి వ్యతిరేఖంగా సీఎం రోడ్ల మీద సర్కస్ ఫీట్లు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ గల్లిలో దోస్తీ, ఢిల్లిలో కుస్తీ చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజే అదానీ వ్యవహారం మీద చర్చ జరగాలని నిరసన తెలిపామని.. అదానీ మీద మాట్లాడేందుకు సీఎం భయపడుతున్నారన్నారు. అదానీకి సంబంధించిన 100 కోట్లను తిరిగిచ్చిన సీఎం.. పెట్టుబడులను కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.