స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఎల్లుండి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎలా ఉండాలని చెప్పేది ఆర్టికల్ 79, 84. రాష్ట్రపతిని ఆహ్వానించక పోవడం సరికాదంటూ మండిపడ్డారు. కనీసం శంకుస్థాపనకి కూడా పిలవలేదు.. మోడీ ఇప్పటి వరకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదంటూ ప్రశ్నించారు. మోడీ హయాంలోనే పార్లమెంట్ అతి తక్కువ పని రోజులు పని చేసిందంటూ విమర్శించారు. కొత్త బిల్లులపై అసలు చర్చనే ఉండదని వ్యాఖ్యానించారు.