ఎండలతో అల్లాడిపోతు న్న ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురందించింది. రాబోయే ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈనెల 31 నాటికల్లా ఇవి కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేర ళ తీరాన్ని తాకనున్నట్లు ప్రకటించింది.
నిర్ణీత సమయానికి మూడ్రోజులు ముందుగా అంటే ఈనెల 19న అండమాన్ సముద్రంలోకి రుతుపవ నాలు ప్రవేశించాయి. ఇవి చురుగ్గా కదులుతుండగా సోమవారం నాటికి బంగాళాఖాతం, శ్రీలంకలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. అలాగే, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ సారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా నెలవారీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరుగుతాయని అంచనా వేస్తోంది. రుతు పవనాలు వేగంగా విస్తరిస్తుండడంతో మంచి వర్షాలకు అవకాశమున్నట్లు పేర్కొంది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు నైరుతి విస్తరించే అవకాశముందని వెల్లడించింది.
వచ్చేనెల 1, 2 తేదీల్లో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థి తులు ఏమైనా మారితే ఒకట్రెండు రోజులు ఆలస్యమై 3, 4 తేదీల నాటికి రాష్ట్రంలో ప్రవేశించే అవకాశ ముంది. మొత్తంగా ఐదో తేదీలోపే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రుతు పవనాలు చురుగ్గా ఉండడంతో వచ్చేనెల మొదటి వారంలో రాయలసీమలోని పలుచోట్ల విస్తారం గా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.


