బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై దాడి జరిగింది. కొందరు నిరసనకారులు ఆయన నివాసంపై దాడి చేసి నిప్పంటించారు. పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ప్రసంగంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి ఆమె పిలుపునిచ్చారు.
ఈనేపథ్యంలోనే ఢాకాలో ఘటనలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇంటిపై దాడి ఘటనపై ఆమె స్పందించారు. నిరసనకారులు ఒక భవనాన్ని కూల్చివేయగలరు, కానీ, చరిత్రను కాదన్న విషయాన్ని వారు గుర్తించుకోవాలని చెప్పారు. బంగ్లా చరిత్రలో ముజిబుర్ నివాసం ఒక ఐకానిక్ చిహ్నాంగా గుర్తింపు పొందింది. అవామీ లీగ్ పాలనలో దీన్ని మ్యూజియంగా మార్చారు.