18వ లోక్‌సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం చేశారు. ప్రధాని మోదీ తీర్మానాన్ని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా పలువు రు ఎన్డీయే ఎంపీలు బలప ర్చారు. ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన ఎంపీ అరవిం ద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక చేపట్టారు. మూజువాణీ ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచారు. దీంతో ఆయన స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.
అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్య మైంది. ఎన్డీయే నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ నామినే షన్ దాఖలు చేశారు. బుధవారం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత మిగిలిపోయిన ఏడుగురు ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభ మైంది. ఎన్డీయే స్పీకర్ అభ్యర్ధిగా ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు, బీజేపీ ఎంపీలు బలపరిచారు.తర్వాత కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ పేరును ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా దీన్ని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీ లు బలపర్చారు.అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించగా మూజువాణీ ఓటుతో ఓం బిర్లా గెలిచినట్టు ప్రకటించా రు. సభాపతిగా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు అభినందించారు.
మరోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వచ్చే ఐదేళ్లు సభ్యులకు మార్గద ర్శనం చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. సభను సరైన దిశలో నడపడంలో స్పీకర్‌ది కీలక పాత్ర అని చెప్పారు. గత ఐదేళ్లు విజయవంతంగా సభ నడిపిన అనుభవం ఓం బిర్లాకు ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా కూటమి తరఫున ఓం బిర్లాకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సభ భారతదేశ జనవాణిని వినిపించాలని కోరారు. సభ సజావుగా నడపడంలో విపక్షం స్పీకర్ కు సహకరిస్తుందని చెప్పారు. ప్రజావాణిని బలంగా వినిపించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. విపక్షాల గొంతు నొక్కడం ద్వారా సభ నడిపించడం అప్రజాస్వామి కమవు తుందని చెప్పారు. రాజ్యాంగాన్ని బలపరిచేలా స్పీకర్ పనితీరు ఉండాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.