ఒలింపిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ జింఖానా మైదానం నుండి ఎల్బీ స్టేడియం వరకు ఒలింపిక్ రన్ కార్యక్రమం జరిగింది. ఈనేపథ్యంలోనే కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఛైర్మన్ ప్రతాప్ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో హైద రాబాద్ జిల్లా యువజన క్రీడావిభాగం అభివృద్ధి అధికారి సుధాకర్, అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ లక్ష్మణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్, ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.


