25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

నాలుగో విడత దశకు నోటిఫికేషన్ జారీ

   తెలంగాణలో పొలిటికల్ వార్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత ఎన్నికలకు తాజాగా ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాలకు అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 సెగ్మెంట్ల కు మే 13న పోలింగ్ జరుగుతుంది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవ ర్గానికి కూడా అదే రోజు ఉప ఎన్నిక నిర్వహిస్తారు.

   తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 29 వరకు గడువు ఇచ్చారు. అంతిమంగా మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాగా తెలంగాణలో తొలిరోజే పలువురు నాయకులు నామినేషన్లు వేశారు. వీరిలో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్, మెదక్ బీజేపీ క్యాండిడేట్ రఘునందన రావు, మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌ నుంచి బీజేటీ టికెట్‌పై పోటీ చేస్తున్న డీకే అరుణ తదితరులున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్‌ గురించి గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్లు లేదని కేసీఆర్ సంచల నాత్మక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరతారో తెలియడంలేద న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూస్తే సాక్షాత్తూ ఆయనే బీజేపీలో చేరతారే మోనన్న అనుమానాలు వస్తున్నాయన్నారు.

    తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటేయమని చెబుతున్న రేవంత్ రెడ్డి, ఢిల్లీ పోయి బీజేపీకి జై కొడుతున్నారని కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చి పూర్తిగా నాలుగు నెలలు కూడా అవకముందే కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు తిరగబడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో మాట్లాడటానికి వణికిపోతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని చెప్పడానికి రేవంత్ రెడ్డి భయపడటమే నిదర్శనమని కేసీఆర్ వెల్లడిం చారు. కాంగ్రెస్ సర్కార్‌ రావడంతోనే తెలంగాణ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయన్నారు. కాగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు ఎవరికి బీ టీమో అర్థం కావడం లేదన్నారు కేసీఆర్.పనిలో పనిగా బీజేపీపై మండిపడ్డారు కేసీఆర్. తెలంగాణకు కమలం పార్టీ అక్కరకు రాని చుట్టం అన్నారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణను బీజేపీ అన్నివిధాల మోసం చేసిందని నిప్పులు చెరిగారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. నవోదయ విద్యాలయాలు సహా అన్నిటి లోనూ తెలంగాణ మోసపోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం అంటే మంజీరా నది లో వేసినట్లేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

    ఇదిలా ఉంటే కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ జోలికొస్తే గులాబీ పార్టీ కార్యాలయం పునాదులు పెకలిస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోగా కూలిపోతుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పదేళ్లు అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం మానేసి, కేసీఆర్ ముందుగా తమ ఇంటిని చక్కబెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని లిల్లీపుట్ అంటూ కేసీఆర్ సంబోధించడాన్ని మంత్రి కోమటిరెడ్డి తప్పుపట్టారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ కూడబ లుక్కుని కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోగా కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. అసలు లోక్‌సభ ఎన్నికల తరువాత భారత్ రాష్ట్ర సమితి పార్టీయే అడ్రస్ లేకుండా పోతుందని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డికి మొహం చూపించలేకనే కేసీఆర్ రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి. మొత్తంమీద రేవంత్ రెడ్డి సర్కార్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపాయి.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్