25.2 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

హర్యానాలో బీజేపీకి ఎదురుగాలి

  2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతాపార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో హర్యానా ముఖ్యమైంది. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్నా రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన బీజేపీ, జేజేపీ లను రైతు సంఘాలు టార్గెట్ చేశాయి. వాస్తవానికి బీజేపీని, జేజేపీ నేతలను పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరి స్తూ రాష్ట్రవ్యాప్తంగా బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. సంయుక్త్ కిసాన్ మోర్చా , భారతీయ కిసాన్ యూనియన్ సహా రైతు సంఘాలు గ్రామాల వెలుపల ఉంచిన అనేక పోస్టర్లలో వ్యవసాయ సమస్యలపై అధికార బిజెపిని ప్రశ్నించాయి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ఈ సారి హర్యానాలో ఎన్నిస్థానాలు గెలుచుకుంటుందో అనుమానమే.

   హర్యానా భారతీయ జనతా పార్టీకి 2019లో పెట్టని కోటగా నిలిచింది. హర్యానాలో మొత్తం పది స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుంది. హర్యానాలో వ్యవసాయ దారులు నుంచి ఎదురుగాలి సాగుతోంది. కిసాన్ పండించిన పంటకు కనీసమద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం తో పాటు రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు హర్యానా రైతులు. సంయుక్త్ కిసాన్ మోర్చా, భారతీ య కిసాన్ యూనియన్ సహా పలు రైతు సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, దాని పూర్వ మిత్రపక్షం జేజేపీ రైతుల కఠిన ప్రశ్నలను ఎదుర్కొనలేకపోతున్నాయి. ఎంఎస్పీపై చట్టం చేయలేకపోవడం, ‘తప్పుడు’ కేసుల్లో రైతులను అరెస్టు చేయడంతో పాటు, వ్యవసాయ రుణాలతో రైతులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫలితంగా ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు సిద్ధమైన బీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

  దిద్దుబాటు చర్యల్లో భాగంగా బీజేపీ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో రాజీనామా చేయించి బీజేపీ హర్యానా శాఖ చీఫ్ గా ఉన్న నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసింది. ఓబీసీ కమ్యునిటీకి చెందిన సైనీకి సీఎం పదవి కట్టపెట్టడం ద్వారా ఆ వర్గాలను ఆకట్టుకునే యత్నం చేసింది. సైనీ బీజేపీ హర్యానా కిశాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. చాలా రైతు సంఘాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండడం ఓ కారణం. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. హర్యానాలో పది లోక్ సభ స్థానాలకు ఆరో విడతలో మే 25న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. హర్యానాలో 2009లో కాంగ్రెస్ 9 స్థానాలు, హెచ్ జే సీ ఒక స్థానాన్ని గెలిచింది. 2014లో మోది ప్రభంజనంలో బీజేపీ 7 ఎంపీ స్థానాలను, కాంగ్రెస్ 1 ఎంపీ సీటును గెలుచుకోగా, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలుపొందారు. 2019లో హర్యానాలో బీజేపీ. మొత్తం పది పార్లమెంటు స్థానాలను గెలిచింది. ఈ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీకి బీజేపీ, కాంగ్రెస్, మరో పక్క జేజేపీ, ఇండియా నేషనల్ లోక్ దళ్ సిద్ధమవుతున్నాయి. హర్యానాలో రాజకీయ పరిస్థితులు కూడా గందరగోణంగానే ఉన్నాయి. చౌతాలా కుటుంబంలో విభేదాల కారణంగా ఐఎన్ఎల్డీలో చీలిపోయింది. అజయ్ చౌతాలా, దుష్యంత్ చౌతాలా 2018 డిసెంబర్ లో జేజేపీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు చౌతాలా కుటుంబం ఇంటి గోలగా మారాయి. హిసార్ నుంచి సునైనా చౌతాలా ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర నుంచి ఎల్లనాబాద్ ఎమ్మెల్యే అభయ్ సింగ్ చౌతాలా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ ఉపప్రధాని దేవీలాల్ మనవడు రవి చౌతాలా సతీమణి సునయన చౌతాలా. జెజెపి అభ్యర్థిగా హిస్సార్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నైనా సింగ్ చౌతాలా బిజెపి అభ్యర్థి రంజిత్ సింగ్ చౌతాలాపై పోటీ చేస్తున్నారు. నైనా చౌతాలా జేజేపీ చీఫ్ అజయ్ సింగ్ చౌతాలా భార్య కాగా, రంజిత్ చౌతాలా మేనమామ. అంబాలా ఎంపీ స్థానం నుంచి గుర్ప్రీత్ సింగ్ ను ఐఎన్ఎల్డీ బరిలోకి దింపింది.

   ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో సమస్య ఎదుర్కొంటోంది. పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరడంతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. 2019లో జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాంపాల్ కొసాలియాకు రాజ్యసభ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా కాంగ్రెస్ సభ్యత్వాన్ని అందజేశారు. బీజేపీకి రాష్ట్రంలో ఎదురుగాలులు వీస్తుండడంతో పలువురు బీజేపీ నాయకులు కాంగ్రెస్ కు క్యూ కట్టారు. వారిలో అశోక్ ఫౌజీ శివనా బేరి, పవన్ శర్మ, అశ్వని, అలోక్, మంజీత్ నంబర్దార్, సత్యవన్, రాజేష్, సత్యేంద్ర, సాహిల్ గుడా, అమిత్ అలియాస్ మోను, ఆజాద్ ఉన్నారు.వ్యవసాయదారుల ఉద్యమం నేపథ్యంలో హర్యానాలో బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ. అమిత్ షా, జెపి నడ్డా బృందం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి. లోక్ సభ ఎన్నికలు ఆరో విడతలో హర్యానా ఎన్నికలు ఉన్నందు వల్ల.. ఆలోగా మోదీ ఏ మ్యాజిక్ అయినా చేసి కమల దళాన్ని గట్టెక్కిస్తారనే ఆశలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మే నెలలో మోదీ హర్యానా పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. లేని పక్షంలో కమల దళానికి చిక్కులు
తప్పవు.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్