ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాను ఏ పని చేపట్టినా మీడియాలో హాట్ టాపిగ్‌గానే మారుతోంది. నూతనంగా రూపొందించిన యుద్ధ ట్యాంకుల్ని నడిపే సైనిక శిక్షణను వీక్షిం చేందుకు వెళ్లిన ఆయన స్వయంగా యుద్ధ ట్యాంక్‌ను నడిపారు. దీనిని ప్రపంచంలోనే అత్యంత శక్తిమం తమైన యుద్ధ ట్యాంకుగా కిమ్ అభివర్ణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
మరోవైపు అగ్రరాజ్యం అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా నిర్వహించిన 11 రోజుల వార్షిక సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా సైనిక శిక్షణను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 2022 ఆరంభం నుంచి ఉత్తర కొరియా నిరంతరం క్షిపణులు, అత్యాధునిక తుపాకులు సహా వివిధ రకాల ఆయుధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. దీనికి ప్రతిస్పం దనగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ త్రైపాక్షిక సైనిక కసరత్తులు నిర్వహిస్తున్నాయి. భారీ యుద్ధ ట్యాంకులతో చేసిన విన్యాసాల్లో ఉత్తర కొరియా సైన్యం అత్యంత కఠిన పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కో వడానికి సిద్ధమైనట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది.


