Nick Davis | ఒక భార్యతోనే వేగలేకపోతున్నామని కొందరు మొరపెట్టుకుంటుంటారు. అలాంటిది అమెరికాకు చెందిన నిక్ డెవిస్ అనే వ్యక్తి మాత్రం ఏకంగా ముగ్గురు భార్యలతో ఎంచక్కా కాపురం చేస్తున్నాడు. అంతేకాదండోయ్ ముగ్గురు భార్యలే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తుంటే ఇంట్లోనే కూర్చుని రాజభోగం అనుభవిస్తున్నాడు. దీంతో తనను తాను రాజుగా పోల్చుకుంటున్నాడు. 15 ఏళ్ల క్రితం మొదటి భార్యను వివాహం చేసుకోగా.. ఆమె అనుమతితో తొమ్మిదేళ్ల తర్వాత జెన్నీఫర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి అనుమతితో డానియేల్ అనే 22ఏళ్ల యువతిని మనువాడాడు. ఎలాంటి గొడవలు లేకుండా ముగ్గురు భార్యలతో కలిసి ఒకే ఇంట్లో జీవిస్తుండడంతో అందరు షాక్ అవుతున్నారు.