26.2 C
Hyderabad
Friday, January 10, 2025
spot_img

రెజ్లర్ల ఆందోళన… ‘అప్పటికీ ఆమె మైనర్ కాదు’

స్వతంత్ర, వెబ్ డెస్క్: భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ లైంగికంగా వేధించినట్టు కేసు నమోదు చేసిన రెజ్లర్ మైనర్ కాదంటూ ఆమె తండ్రే స్వయంగా ఒప్పుకున్నాడు. దీంతో బ్రిజ్ భూషన్ పై నమోదైన కేసుల్లో పోక్సో చట్టం కింద ఎంపీపై నమోదైన కేసు నుండి ఆయనకు ఉపశమనం లభించే ఛాన్స్ ఉంది.

గత కొంత కాలంగా భారత రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఏప్రిల్ 29న నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరితగతిన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ నిరవధికంగా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున రెజ్లర్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో రెజ్లర్లు దీన్ని అవమానంగా భావించి తాము సాధించిన పతకాలను గంగానదిలో కలిపేయాలనుకోవడంతో.. రైతు సంఘం నాయకులు కల్పించుకుని రెజ్లర్లను వారించడం వంటి వరుస పరిణామాల మధ్య రెజ్లర్లు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.

అనంతరం భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో ఆరు గంటల పాటు చర్చించి విచారణపై రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో అప్పటికి సమస్య సద్దుమణిగింది. ఇంతలో ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణ చేసిన రెజ్లర్ సంఘటన జరిగే సమయానికి అసలు మైనరే కాదని స్వయంగా ఆమె తండ్రే వెల్లడించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు నమోదు చేసిన టైంలో ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో పుట్టుక వివరాల్లో తప్పులు దొర్లాయని ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో బ్రిజ్ భూషణ్ పై పోక్సో చట్టం కింద నమోదైన కేసు నుంచి ఉపశమనం లభించే అవకాశముంది.

 

 

 

Latest Articles

నెక్నాంపూర్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

మణికొండ నెక్నాంపూర్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో నిర్మించిన విల్లాలు కూల్చేస్తున్నారు. నెక్నాంపూర్‌లో ఇప్పటి వరకు 4విల్లాలను హైడ్రా సిబ్బంది కూల్చేసింది. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో అక్రమంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్