28.2 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

నూతన ప్రభుత్వం – సరికొత్త విధానాలు

      ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇటీవల ఏర్పడ్డ కేంద్ర మంత్రివర్గాన్ని చూస్తే దేశం భారీ మార్పుల వైపు అలాగే సంస్కరణల వైపు వెళుతున్నట్లు తెలుస్తోంది. మూడోసారి కూడా మంత్రివర్గ కూర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గత రెండుసార్లు అధికారం లో ఉన్నది అచ్చంగా బీజేపీ ప్రభుత్వం. ఈసారి పరిస్థితి మారింది.ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది నూటికి నూరు శాతం ఎన్డీయే ప్రభుత్వం.

    ఈసారి నరేంద్ర మోడీ పనితీరులో మార్పు కనిపించే అవకాశాలున్నాయి. విధానపరమైన అన్ని నిర్ణయాలకు ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాల ఆమోదం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఈసారి ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలమీద కమలనాథులు ఆధారపడక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం నరేంద్ర మోడీ ప్రభుత్వ పనితీరులో కొంతమేర కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత రెండుసార్లు ఏర్పడ్డ ప్రభుత్వాలతో పోల్చి చూస్తే తాజా కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో దూకుడు తగ్గవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్డీయే కూటమి లోని భాగస్వామ్య పక్షాలు ఒక తాటి మీద నిలబడటానికి, కలసికట్టుగా ఉండటానికి వేటి కారణాలు వాటికి ఉన్నాయి. అయితే భాగస్వామ్య పక్షాల వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉండకపోవచ్చు. ఇదిలా ఉండగా, మెజారిటీ మంత్రిత్వ శాఖలు పాత వారికే అప్పగించారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో విదేశీ, ఆర్థిక, రక్షణ విధానాల్లో పెద్దగా మార్పు ఉండక పోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

   నిర్మలా సీతారామన్‌కు గతంలో ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ఇచ్చారు. రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ శాఖ ఇచ్చారు. జై శంకర్‌కు మరోసారి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కట్టబెట్టారు. వీటన్నిటితో పాటు బీజేపీలో నెంబర్ టూ గా అందరూ భావిస్తున్న అమిత్ షాకు మరోసారి హోమ్ మంత్రిత్వ శాఖ అప్పగిం చారు. ఈ మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే, బీజేపీ ప్రభుత్వం గతంలో మిగిలిపోయిన లక్ష్యాలను పూర్తి చేయాలని నరేంద్ర మోడీ గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ రక్షణ ఆశయాలను నెరవేర్చడంతో పాటు సైన్యం కోసం అగ్నిపథ్ వంటి పథకాలను అమలు చేయడం లో కూడా రాజ్‌నాథ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. అయితే ఈసారి అగ్నిపథ్ పథకంపై జేడీ యూ సహా మరికొన్ని భాగస్వా మ్యపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పంజాబ్‌, హర్యానా సహా అనేక ఉత్తరాది రాష్ట్రాల నుంచి సైన్యంలో చేరే యువత పెద్ద సంఖ్యలో ఉంటుంది. అయితే అగ్నిపథ్ పథకం లో సర్వీసు కేవలం నాలుగేళ్లే ఉంటుంది. ఆ తరువాత స్వచ్ఛందంగా రిటైర్ చేయాల్సి ఉంటుంది. కాగా నాలుగేళ్ల సర్వీసు కాలాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని యువత జీర్ణించు కోవడం లేదు. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేస్తే పెన్షన్, గ్రాట్యుటీ వంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా దక్కవు. మళ్లీ ఉద్యోగం కోసం అగ్నివీరులకు వెతుకులాట తప్పదు. ఈ విషయంలో జేడీయూ సహా మరికొన్ని భాగస్వామ్య పక్షాలను రాజ్‌నాథ్ సింగ్ సముదా యించవలసి ఉంటుంది.

  విదేశాంగ మంత్రిగా జై శంకర్ ఈసారి కీలకపాత్ర పోషించనున్నారు. సాంప్రదాయక బంధాలను పటిష్టం చేయడంతో పాటు వివిధ దేశాలతో కొత్త బంధాలను ఏర్పరచుకోవడంలో గతంలోనే జై శంకర్ తీవ్రంగా శ్రమించారు.ఒక వైపు అమెరికాతో సత్సంబంధాలను కొనసాగిస్తూ మరోవైపు రష్యాతోనూ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో జై శంకర్ అత్యంత సమర్థంగా వ్యవహరించారు. ఇక అంతర్జాతీయ వ్యవహా రాల విషయానికొస్తే రెండేళ్లుగా రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం విషయం లో భారత్ న్యూట్రల్‌ గా వ్యవహరించింది. ప్రత్యేకించి ఏ దేశానికి అనుకూలంగా వ్యవహ రించలేదు. అంతిమంగా భారతదేశ ప్రయోజనాలకే జై శంకర్ కట్టుబడ్డారు. అలాగే ఎనిమిది నెలలుగా పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం నడుస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యమైన అమెరికా మద్దతు ఉందన్నది వాస్తవం. ఒక దశలో ఇరాన్ కూడా పాలస్తీనా తరఫున ఇజ్రాయెల్‌తో పోరాటం జరిపింది. వాస్తవానికి భారత్ – ఇరాన్ మధ్య ఎప్పటి నుంచో వాణిజ్యపరమైన సంబంధాలు న్నాయి. అయినప్పటికీ భారతదేశ ప్రయోజనాలు దెబ్బతినేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు.

  కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రపంచంలోని అనేకదేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేల య్యాయి. అయితే మనదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తన సత్తా నిరూపించుకున్నారు. ఇక హోమ్ మంత్రి అమిత్ షా విషయానికి వస్తే, దేశంలో శాంతి భద్రతలు కాపాడటంలో ఆయన అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు ఉగ్రవాదులను, తీవ్రవాదులను ఎదుర్కోవడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. ఏమైనా ప్రతి మంత్రికి స్పష్టమైన, నిర్దిష్టమైన లక్ష్యాలను ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించారు. కాగా మూడోసారి తాము అధికారంలోకి వస్తే, తప్పనిసరిగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారసభల్లో నరేంద్ర మోడీ ఊదరగొట్టారు. అంతేకాదు కొన్ని రంగాల్లో సంస్కరణలు కూడా చేపడతామన్నారు. నరేంద్ర మోడీ ప్రచారాన్ని విశ్లేషిస్తే, ప్రస్తుత ప్రభుత్వం గత సర్కార్‌లాగా ఉండదన్న విషయం స్పష్టం అవుతోంది. ఎన్డీయే కూటమిలో కొత్తగా చేరిన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్, జనతాదళ్ సెక్యులర్, ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీలకు ఈ విషయం తెలియనిది కాదు. ఈ ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదిరిన తరువాతే రానున్న రోజుల్లో తమ పార్టీ ప్రాధాన్య ఇవ్వబోయే అంశాలను ఎన్నికల ప్రచారసభల్లో నరేంద్ర మోడీ వెల్లడించారు. మంత్రివర్గంలో వివిధ పార్టీలకు ఇచ్చిన ప్రాతినిధ్యాన్ని బట్టి చూస్తే, నరేంద్ర మోడీ ప్రభుత్వ జాతీయవాద ధోరణి, దేశ ప్రాధాన్యం మరింతగా స్పష్టమవుతున్నాయి. అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన క్రైస్తవులకు, సిక్కులకు క్యాబినెట్‌లో తగిన ప్రాధాన్యం ఇచ్చారు. కాగా క్యాబినెట్‌లో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ, వారి సంక్షేమం విషయంలో తాము రాజీ పడేది లేదని నరేంద్ర మోడీ ప్రకటించారు. మొత్తంమీద కొత్త విధానాలతో నరేంద్ర మోడీ కొత్త ప్రభుత్వం దూసుకుపోవడానికి సన్నద్ధ మైంది.

Latest Articles

నిరుద్యోగులను కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు – చనగాని దయాకర్

నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తున్న కేటీఆర్.. గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్