19.7 C
Hyderabad
Sunday, February 15, 2026
spot_img

వైద్యాధికారుల నిర్లక్ష్యం… చిన్నారికి గాయాలు

   భూపాలపల్లి జిల్లా 100 పడకల ఆస్పత్రిలో వైద్యాధికారుల నిర్లక్ష్యంపై బాధితులు తీవ్రస్థాయిలో మండిప డుతున్నారు. కలెక్టర్ ఆదేశాలను పెడ చెవిన పెట్టారంటే వారు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారో అర్థమై పోతుందని ఫైర్‌ అవుతు న్నారు. కాలిన గాయాలతో చికిత్స కోసం వెళ్లిన చిన్నారిని పట్టించుకో కుండా బర్త్‌డే వేడుకల్లో మునిగిపోవడంతో ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

   భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన చిన్నారి అక్షయ అగ్నిప్రమాదంలో తీవ్రగాయాలపాలైంది. అయితే, పాపకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌ బవేష్‌ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే చిన్నారిని రెండుసార్లు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లినా, ఎన్నికల కోడ్‌ తర్వాత పాప పరిస్థితి పరిశీలిస్తామని చెప్పడంతో తల్లిదండులు అక్షయను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి సర్జరీ చేయిం చారు. అయితే, పాపకు డ్రెసింగ్‌ చేసేందుకని 100 పడకల ఆస్పత్రికి తీసుకురాగా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కుటుంబ సభ్యులే స్ర్టక్చర్‌పై ఆస్పత్రిలోకి తరలించారు. ఇక లోపల ఫ్యాన్‌ కూడా లేకపోవ డంతో కాలిన గాయానికి తోడు ఉక్కపోతతో పాప అల్లాడిపోయింది. ఇకనైనా వైద్యాధికా రులు స్పందించి తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు చిన్నారి అక్షయ తల్లిదండ్రులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్