Investment Schemes |పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో పథకాలు ఉన్నాయి. చాలా మంది అధిక రాబడి రావడంతో పాటు.. రిస్క్ లేని స్కీమ్స్ ఏమున్నాయనేది చూస్తుంటారు. పోస్టాఫీసుతో పాటు బ్యాంకుల్లో అనేక సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మరికొంతమంది మరింత రాబడి కోసం షేర్స్ లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే కొంత రిస్క్‌ను భరించాల్సి ఉంటుంది. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ రిస్క్ చేయడానికి సహసించరు. అటువంటి వారు నిర్ధిష్టంగా తమకు రాబడి వచ్చే పథకాల్లో మాత్రమే పెట్టుబడి పెడుతుంటారు.
కొన్ని ప్రయివేట్ సంస్థలు సైతం కొన్ని రకాల పథకాలను ప్రవేశపెట్టి.. అధిక రాబడి ఆశ చూపిస్తూ ఆకర్షిస్తుంటాయి. కొంతమంది ఆ పథకాలకు ఆకర్షితులవుతారు. కాని రిస్క్ భరించడం ఇష్టంలేని వ్యక్తులు అలాంటి పథకాలకు దూరంగా ఉండటమే బెటర్. సామాన్య, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు.. పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు సైతం పొదుపు పథకాలపై అధిక వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. ఇంతకీ ఏ పథకంలో ఎంత వడ్డీ రేటు లభిస్తుంది. ఎవరికి ఏ పథకం ఉత్తమం అనేది తెలుసుకుందాం.
సీనియర్ సిటిజన్లు పన్ను ఆదా కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వారికి గొప్ప పెట్టుబడి ఎంపిక అవుతుంది. ఈ పథకంలో పెట్టుబడి దారులకు 8 శాతం రాబడి లభిస్తుంది. ఇటీవల ప్రభుత్వం తన పెట్టుబడి పరిమితిని 15 లక్షల నుండి 30 లక్షలకు పెంచింది.
కిసాన్ వికాస్ పత్ర కూడా రిస్క్ లేని పెట్టుబడి ఎంపిక. ఈ పథకం పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. 7.2శాతం వడ్డీని అందిస్తోంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకం. దీని కింద పెట్టుబడిదారులు కాంపౌండింగ్ ప్రాతిపదికన 7.1శాతం రాబడిని పొందుతారు.
నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కూడా మరొక రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఇందులో పెట్టుబడి పెడితే 7శాతం వడ్డీని పొందవచ్చు.
ఎవరైనా తమ ఆడపిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, వారు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా 8 శాతం వడ్డీని పొందవచ్చు.
Read Also:
- పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేవారికి బోలెడన్ని బెనిఫిట్స్..
- రైతుల కోసం కేంద్రప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమిటో తెలుసా..
Follow us on: Youtube