30.2 C
Hyderabad
Thursday, September 28, 2023

Janasena |ఈసారి జనసేన ఆవిర్భావ సభ అక్కడే.. వారాహితో ఎంట్రీ ఇవ్వనున్న పవర్‌స్టార్‌

Janasena Party Anniversary meeting will be held in Machilipatnam on March 14 |జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణబద్దుల్ని చేసే వేదిక ఈ ఆవిర్భావ సభ అని అన్నారు. సభా వేదికపై రైతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు పేరిట సభా వేదికను ఏర్పాటు చేస్తామని, జాతి గర్వించే మహానుభావుడు శ్రీ పింగళి వెంకయ్య, స్వతంత్ర సమర సాయుధ పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ల త్యాగాలను స్మరించుకునే విధంగా సభ ప్రాంగణం ఉంటుందన్నారు.

మార్చి 14వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పారు. రాబోయే పది రోజుల్లో సభ కోసం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేంగా పాల్గొనాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సామాన్యుడి గళం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తూ.. గత 9 ఏళ్లుగా జనసేన పార్టీ చేస్తున్న కృషి ప్రజలందరికీ తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సహనం కోల్పోకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల కోసం ముందుకు వెళ్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు… పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చిన ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్రమాన్ని పవిత్రంగా భావించి ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు.

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్వహించే ఈ సభ కోసం వచ్చే జనసైనికులు, వీర మహిళలు, నాయకులకు తగు రీతిన సౌకర్యాలు కల్పించాలని సూచించారన్నారు. గత ఆవిర్బావ సభలో రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని ఇచ్చిన పిలుపు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు తెచ్చిందని, రేపటి సభలో జనసేన పార్టీ భవిష్యత్ కార్యచరణను పవన్ కళ్యాణ్ వివరిస్తారని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Read Also: త్వరలోనే జనసేనాని కీలక నిర్ణయం.. ఏపీ రాజకీయ స్వరూపం మారనుందా..

 Follow us on:  Youtube

Latest Articles

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్ చెన్నైలోని ఓ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్