36.2 C
Hyderabad
Friday, May 9, 2025
spot_img

మూడు దశాబ్దాల తరువాత భారత్ వేదికగా ప్రపంచ సుందరి ఎంపిక పోటీలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: భారతదేశం మూడు దశాబ్దాల తరువాత ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు ఆతిధ్యం ఇవ్వనుంది. 1996 తరువాత భారత్ లో ఈ ఏడాది  71వ ప్రపంచ సుందరి – 2023 ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌, సీఈవో జులియా మోర్లే మీడియా సమావేశంలో ప్రకటించారు. 130 దేశాల జాతీయ ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నవంబర్‌లో నెల రోజులు పాటు విడిది చేస్తారు. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడల సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయి. మార్పునకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వీటి ఉద్దేశం’’ అని వివరించారు. ఈ పోటీల ప్రచారం కోసం భారత్‌కు వచ్చిన గతేడాది ప్రపంచ సుందరి విజేత కరోలినా బియెలావ్‌స్కా (పోలండ్‌) మాట్లాడుతూ.. ‘‘గొప్ప ఆతిథ్యానికి, విలువలకు ప్రతిరూపమైన ఈ అందమైన దేశంలో నా కిరీటాన్ని తదుపరి విజేతకు అందించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’’ అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్