స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ ల ప్రేమాయణం ఎంత వివాదానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు పదుల వయసులో మూడో భార్యతో విడాకులు, నటి పవిత్రతో ప్రేమ వ్యవహారాలు అబ్బో పెద్ద దుమారమే చెలరేగింది. తన నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మళ్లీ పెళ్లి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో నరేంద్రగా నరేశ్, పార్వతిగా పవిత్ర నటించారు. ఇక నరేశ్ మూడో భార్య పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం నుంచి ‘మా’ ఎలక్షన్స్, బెంగళూరు హోటల్ ఎపిసోడ్, మూడో భార్యను ఆయన తన్నడం లాంటి సన్నివేశాలతో మూవీపై ఆసక్తి పెంచారు. ఈ చిత్రం ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది.


