స్వతంత్ర వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ తనకి తుపాకీ లైసెన్స్ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్స్ ఇవ్వాలంటూ పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డికి తన అభ్యర్ధనను తెలియజేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నరేష్ ఇంటి పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న గచ్చిబౌలిలోని నరేష్ ఇంటిపై కొందరు దుండగులు దాడికి పాల్పడి ఇంటి ముందు పార్క్ చేసిన కారుని ధ్వంసం చేశారు. నరేష్ ఆ విషయం పై పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు. మళ్ళీ ఇన్నిరోజులు తరువాత నరేష్ గురువారం (జులై 6) నాడు పుట్టపర్తి పోలీసులను ఆశ్రయించి తుపాకీ లైసెన్స్ కోసం అభ్యర్ధించడం చర్చనీయాంశం అయ్యింది.
నరేష్ అతని మూడో భార్య రమ్య రఘుపతి మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ తన సహా నటి పవిత్రా లోకేశ్ ని ఇటీవల పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత ఇద్దరు కలిసి ‘మళ్ళీ పెళ్లి’ అనే పేరుతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాని తెరకెక్కించడం టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆ సినిమాలో తనని తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని, రిలీజ్ ని ఆపాలంటూ రమ్య రఘుపతి కోర్ట్ మెట్టులు కూడా ఎక్కింది.అయినా సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అందుకోలేకపోయింది. ఓటీటీలో మాత్రం మంచి ప్రజాధారణ అందుకుంది.