సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఖరారు చేసింది. లాస్య నందిత మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే శ్రీగణేష్‌ను బరిలో దించింది హస్తం పార్టీ. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.


