స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సమయంలో లోకేశ్ తో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. ఈ క్రమంలో ఆయన కుడి భుజానికి గాయమైంది. అయినప్పటికీ నొప్పితోనే పాదయాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు. 50 రోజులు దాటినా నొప్పి తగ్గకపోవడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్‌లో లోకేశ్ స్కానింగ్ చేయించుకున్నారు. కాగా యువగళం పాదయాత్ర నేటితో 103వ రోజుకు చేరుకుంది.