ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న నారా భువనేశ్వరికి… ఆలయ ఈఓ పెద్దిరాజు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అర్చకస్వాములు స్వామిఅమ్మవార్ల విభూతి తిలకం భువనేశ్వరికి అందించారు. అనంతరం స్వామివారి గర్భాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భ్రమరాంభాదేవి అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఈఓ పెద్దిరాజు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి స్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని అందించారు.